News September 13, 2025

SLBC: ఇకపై DBM పద్ధతిలో తవ్వకం

image

TG: ఈ ఏడాది FEBలో SLBC టన్నెల్ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై టన్నెల్ బోరింగ్ మిషన్(TBM)తో తవ్వడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పనిని డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతి(DBM)లోనే చేపట్టనుంది. జలయజ్ఞంలో భాగంగా 2005లో SLBC సొరంగ మార్గం నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 నెలల్లో దీన్ని పూర్తిచేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరగగా ఇప్పటికి 20 ఏళ్లవుతున్నా పూర్తికాలేదు.

Similar News

News December 9, 2025

‘ఇండిగో’ సంస్థకు షాక్ ఇచ్చిన కేంద్రం

image

దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, ఆలస్యంపై విమానయాన సంస్థ ఇండిగోకు కేంద్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇండిగోకు ఉన్న స్లాట్లలో 5% కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రోజూ నడిచే సర్వీసులు కనీసం 110 వరకు తగ్గే అవకాశముంది. తగ్గించిన స్లాట్లు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్‌జెట్ వంటి సంస్థలకు కేటాయించనున్నారు. ప్రయాణికుల అసౌకర్యం తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమని DGCA పేర్కొంది.

News December 9, 2025

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 5 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ ( మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) నెట్/SLET పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పీజీ స్థాయిలో టీచింగ్ చేసిన అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://uohyd.ac.in/

News December 9, 2025

విడిపోతున్న జంటలు.. పూజారులు ఏం చేశారంటే?

image

హలసూరు(KA) సోమేశ్వరాలయంలో ప్రేమ, పెద్దల అంగీకారం లేని జంటల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటల్లో విడాకుల కేసులు విపరీతంగా పెరగడంతో పూజారులు కలత చెందారు. ఈ పవిత్ర స్థలానికి చెడ్డపేరు రావొద్దని పెళ్లిళ్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని విడాకుల కేసుల విచారణ సమయంలోనూ పూజారులను కోర్టుకు పిలుస్తున్నారని, అది కూడా ఓ కారణం అని అధికారులు చెబుతున్నారు.