News April 2, 2024

స్వల్పంగా పెరిగిన పత్తి విత్తన ధరలు

image

TG: కేంద్రం మరోసారి పత్తి విత్తనాల ధరలు పెంచింది. దీంతో గతేడాది 475గ్రాముల ప్యాకెట్ ధర రూ.853 ఉండగా.. ఇప్పుడు రూ.864కి చేరింది. కంపెనీల డిమాండ్లకు అనుగుణంగా కేంద్రం ఏటా ధరలు పెంచుతోంది. 2020-21లో ప్యాకెట్ ధర రూ.730 ఉండేది. ఇప్పుడు రూ.864కు చేరింది. ఇక తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి. ఇప్పటికే వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలకు ఈ ధరల పెరుగుదల మరికొంత భారం కానుంది.

Similar News

News February 18, 2026

నాకు క్లీన్ చిట్ వచ్చింది.. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’పై ట్రంప్

image

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో నేను రహస్యంగా దాచుకోవడానికి ఏమీ లేదు. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కోర్టు కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్‌స్టీన్ తనకు వ్యతిరేకంగా పని చేసినట్లు ఆరోపించారు.

News February 18, 2026

జపం ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు?

image

జపం చేసే స్థలం, ఆసనాన్ని బట్టి ఫలితం మారుతుందని శాస్త్ర వచనం. వాటి ప్రకారం.. ఉన్ని వస్త్రంపై జపం వంశవృద్ధిని, పర్వత శిఖరంపై జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితం, నదీ తీరంలో చేస్తే అంతకన్నా 2 రెట్లు, గోశాలలో 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. తిరుమల, కాశీ, శ్రీశైలం వంటి స్వయంభూ క్షేత్రాల్లో చేసే జపానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సూర్యుడు, గురువు, దీపానికి అభిముఖంగా జపం చేయాలి.

News February 18, 2026

సోనియా నన్ను CM చేయాలనుకున్నారు.. కానీ: హిమంత

image

2014లో తనను అస్సాం CM చేయాలని నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అనుకున్నారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. కానీ రాహుల్ వల్ల మొత్తం మారిపోయిందన్నారు. ‘తేదీ నిర్ణయించుకోమని మేడమ్(సోనియా) చెప్పారు. జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నా. USలో ఉన్న రాహుల్ పార్టీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిపోయింది’ అని ఆరోపించారు. 2015 ఆగస్టులో కాంగ్రెస్ నుంచి BJPలోకి ఆయన చేరారు. 2021లో CM అయ్యారు.