News August 9, 2024
SMC Elections: అనంత.. 29, సత్యసాయిలో 10 చోట్ల వాయిదా
★ అనంతపురం జిల్లాలో 1741 పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 971 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా 741 చోట్ల ఎన్నికలు జరిగాయి. కోరం లేక 29 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
★ సత్యసాయి జిల్లాలో 2065 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2055 కమిటీలను ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నారు. కోరం లేక 10 చోట్ల వాయిదా పడ్డాయి.
Similar News
News September 18, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక సరఫరా
ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం నుంచి ఉచిత ఇసుక ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో ఇసుక తరలింపుపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం సీసీ రేవు, ముదిగుబ్బ మండలం పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ ఉంటుందన్నారు.
News September 18, 2024
ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి సమయంలో ఎవరూ బస చేయకూడదు: కలెక్టర్
ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి సమయాలలో ఎవరూ బస చేయరాదని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం నుంచి జిల్లాలోని సీసీ రేవు, పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ జరుగుతుందన్నారు. కొత్త మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తామన్నారు.
News September 18, 2024
నేడు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.