News February 17, 2025
పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త, మామ.. అల్లుడి మృతి

TG:కుమార్తెతో గొడవ పెట్టుకున్నాడనే కోపంతో అల్లుడిపై అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన ఇది. పాల్వంచ(మ) దంతెలబోరకు చెందిన గౌతమ్‌కు రామచంద్రునిపేటకు చెందిన కావ్యతో 3 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇటీవల భర్తతో గొడవ కావడంతో ఆమె పుట్టింటికెళ్లింది. భార్యను తీసుకెళ్లేందుకు FEB 2న వచ్చిన గౌతమ్‌కు ఆమె కుటుంబ సభ్యులతో గొడవైంది. ఆగ్రహంతో అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు.
Similar News
News April 12, 2026
మహిళా రిజర్వేషన్ చట్టం.. ఫ్లోర్ లీడర్లకు మోదీ లేఖ

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు టైమ్ వచ్చిందని PM మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే కోటా అమల్లోకి వస్తుందని ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాలని MPలను కోరారు. ఏప్రిల్ 16 నుంచి 3రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, MPలు హాజరు కావాలని BJP విప్ జారీ చేసింది.
News April 12, 2026
అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.
News April 12, 2026
ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It


