News May 1, 2024
విరాట్ బాలీవుడ్‌కి అల్లుడు: షారుఖ్

విరాట్ కోహ్లీ తమ హిందీ చిత్ర పరిశ్రమకు అల్లుడు వంటివారని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ‘విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. మా పరిశ్రమకు అల్లుడిగా అభివర్ణిస్తుంటాను. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే తనతోనే నాకు పరిచయమెక్కువ. ఎక్కువ సేపు కలిసి టైం పాస్ చేస్తుంటాం. అనుష్కతో నటిస్తున్న సమయంలో వారి డేటింగ్ గురించి తెలిసింది. నా సినిమాల్లో కొన్ని స్టెప్పులు విరాట్‌కు నేర్పిస్తుంటా’ అని తెలిపారు.
Similar News
News December 7, 2025
బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే

చిన్నస్వామి స్టేడియం నుంచి IPL మ్యాచ్‌లను తరలించడానికి అనుమతించేది లేదని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘ఇది కర్ణాటక, బెంగళూరు గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా చూస్తాం. కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది విజయోత్సవ ర్యాలీలో 11 మంది చనిపోయిన నేపథ్యంలో IPL మ్యాచ్‌లను పుణేకు షిఫ్ట్ చేసేందుకు RCB <<18265735>>ప్రయత్నిస్తోంది.<<>>
News December 7, 2025
బోర్లు ఇంటికి ఏ దిశలో ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. బోర్లు ఇంటి ప్రాంగణంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలో ఉండటం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అలా సాధ్యంకాని పక్షంలో కనీసం తూర్పు, ఉత్తర దిక్కులలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. ఈ నియమాలు పాటించేవారికి అదృష్టం, అభివృద్ధి, సంపద, ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని, వాస్తుకు సంబంధించి దోషాలు కలగవని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 7, 2025
శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్‌కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.


