News October 21, 2024
పాక్ యువతిని పెళ్లాడిన బీజేపీ నేత కుమారుడు

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ తహ్సీన్ షాహిద్ కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్, పాకిస్థాన్‌కు చెందిన ఆంద్లీప్ జారా అనే యువతిని ఆన్‌లైన్‌లో నిఖా చేసుకున్నారు. హైదర్‌కు వీసా లభించకపోవడం, అటు జారా తల్లి అనారోగ్యంతో ICUలో ఉండటంతో ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకున్నట్లు హైదర్ తెలిపారు. తన భార్యకు త్వరలోనే భారత వీసా లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
2026 మార్చిలోపు ATM, UPI నుంచి పీఎఫ్ విత్‌డ్రా: కేంద్ర మంత్రి

ATM, UPI నుంచి PF విత్‌డ్రా చేసుకునే అవకాశం మార్చి 2026లోపు అందుబాటులోకి తెస్తామని కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ‘కారణం చెప్పకుండానే 75% వరకు పీఎఫ్ తీసుకోవచ్చు. ఆ డబ్బు మీది. అందుకే విత్‌డ్రా చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న కఠినమైన రూల్స్‌ను సులభతరం చేస్తున్నాం. పీఎఫ్ అకౌంట్‌కు బ్యాంక్ ఖాతా లింక్ చేసుకుంటే డెబిట్ కార్డుతో ATMలో విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది’ అని చెప్పారు.
News December 16, 2025
453 Asst Prof పోస్టుల భర్తీ కోసం సీఎంకు ఫైల్

TG: వర్సిటీల్లోని 453 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఫైలును CM రేవంత్‌కు పంపింది. 12 వర్సిటీల్లో 1061 పోస్టులు ఖాళీ ఉండగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో కొన్ని భర్తీ అయ్యాయి. వాటిని మినహాయించి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు నివేదించారు. సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. కాగా ఎక్కువ ఖాళీలు OUలోనే ఉన్నాయి.
News December 16, 2025
విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.


