News March 26, 2024
సోనియా, రాహుల్ PM సీటు త్యాగం చేశారు: DK

కాంగ్రెస్ పార్టీ సమైక్యత కోసం సోనియా, రాహుల్ గాంధీ PM పీఠాన్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 2004లో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన సోనియా.. మన్మోహన్‌ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. అప్పుడు MPలు, UPA కూటమిలోని పార్టీలన్నీ సోనియానే PM కావాలని కోరుకున్నాయని వెల్లడించారు. కానీ, ఓ ఆర్థికవేత్త కోసం ఆమె ప్రధాని పీఠం త్యాగం చేశారని అన్నారు.
Similar News
News February 17, 2026
శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.
News February 17, 2026
రికార్డు సృష్టించిన శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్

T20 WCలో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సృష్టించింది. హాట్‌స్టార్‌లో 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ఈ టోర్నీలో 100 మిలియన్ల వ్యూయర్‌షిప్ సాధించిన తొలి నాన్ ఇండియా మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 181 పరుగుల <<19162360>>లక్ష్యాన్ని<<>> 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. T20 WCలో ఆ జట్టుకు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్.
News February 17, 2026
ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.


