News March 27, 2024
తమ దేశ బౌలర్లను ఉతికారేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు రెచ్చిపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (277) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. కాగా ముంబై జట్టులోని సౌతాఫ్రికా బౌలర్లు క్వేనా మఫాకా, గెరాల్డ్ కోయెట్జిను ఆ దేశ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్ చితకబాదారు. ఇద్దరినీ కలిపి 8 ఓవర్లలో 123 పరుగులు బాదారు. ముఖ్యంగా క్లాసెన్ ధాటికి వీరిద్దరూ బెంబేలెత్తిపోయారు.
Similar News
News February 19, 2026
రాష్ట్ర పండుగగా రాజాం పైడితల్లి అమ్మవారి జాతర

AP: విజయనగరం(D) రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవాలకు రూ.50లక్షల నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
News February 19, 2026
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 83,762 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 25,831 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో HCL, టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫీ షేర్లు లాభాల్లో.. ఇండిగో, KWIL, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
News February 19, 2026
‘వారణాసి’ నాకు కెరీర్ డిఫైనింగ్ సినిమా: ప్రియాంకా చోప్రా

‘వారణాసి’ తనకు కెరీర్ డిఫైనింగ్ సినిమా అవుతుందని హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ‘రాజమౌళికి ఉన్న విజన్ ఎవరికీ లేదు. ఆయనతో వర్క్ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. నా కెరీర్‌పై ఈ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది చాలా భిన్నం’ అని ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2027 APR7న రిలీజ్ కానుంది.


