News August 14, 2025

రేపు పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు

image

AP: కేంద్రం ఆదేశాల మేరకు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పథకాలపై అవగాహన, పశుసంవర్ధక శాఖ తోడ్పాటుతో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడంపై తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది.

Similar News

News March 13, 2026

స్పెర్మ్ రేసింగ్‌ ప్రపంచకప్.. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ!

image

పురుషుల్లో ఫెర్టిలిటీపై అవగాహనకు ఓ US స్టార్టప్ వినూత్నంగా స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. విజేతలకు $1,00,000 (₹92.33L) ప్రైజ్ మనీ ఇస్తారు. హెల్త్, శాంపిల్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మైక్రోస్కోప్‌లో వీర్యకణాలకు క్వాలిఫయింగ్ రేస్, హెడ్ టు హెడ్, ఫైనల్ నిర్వహిస్తారు. 2025లో USలో $10,000 క్యాష్ ప్రైజ్‌తో నిర్వహించిన రేస్ సక్సెస్ కావడంతో ఈసారి 128 దేశాల అథ్లెట్లతో టోర్నీ జరపనుంది.

News March 13, 2026

కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

image

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in

News March 13, 2026

ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.