News September 10, 2025

SPMVV: నూతన డేటా సెంటర్ ప్రారంభం

image

SPMVVలో బుధవారం ఇండియన్ సొసైటీ ఫర్ ప్రోపబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నూతన డేటా సెంటర్‌ను ప్రారంభించినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, మహిళా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఉమ, IIT తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ, ISI కలకత్తా మాజీ డైరెక్టర్ ప్రకాశ్ రావు పాల్గొన్నారు. గణాంక శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News December 17, 2025

MNCL: ఎన్నికలకు కట్టుదిట్టమైన బందోబస్తు: సీపీ

image

మంచిర్యాల జిల్లాలో బుధవారం జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను సైతం సిద్ధంగా ఉంచామని ఆయన వెల్లడించారు.

News December 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 17, 2025

తిరుపతి: వారి సహకారంతోనే.. అంతకుమించి.!

image

గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ భూములు, డీకేటి భూముల్లో<<18577986>> జీ ప్లస్–2<<>> వరకు మాత్రమే పంచాయతీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై వ్యవహారం నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీ ప్లస్–2 మించి నిర్మాణం చేస్తే పంచాయతీ కార్యదర్శి అడ్డుకుని నోటీసులు జారీ చేయాలి.