News July 3, 2024
‘జికా’ వ్యాప్తి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

పుణేలో ‘జికా’ వైరస్ <<13549424>>సోకిన<<>> నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. గర్భిణులను అప్రమత్తం చేస్తూ జికా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది. వైరస్ సోకిన వారిలో పిండం పెరుగుదలను క్షుణ్ణంగా పరిశీలించాలంది. ఆసుపత్రుల్లో సౌకర్యాలపై నోడల్ అధికారులను నియమించాలని పేర్కొంది. ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది.
Similar News
News December 12, 2025
మహబూబాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 155 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.99 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.
News December 12, 2025
అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం

AP: అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


