News November 19, 2025
SRCL: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి హేయమైన చర్య: మంత్రి పొన్నం

రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన <<18333594>>దాడిని<<>> రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి చేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్పీని ఆదేశించారు.
Similar News
News January 22, 2026
YS జగన్‌పై ఫైర్ అయిన మంత్రి గొట్టిపాటి

క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం విమర్శించారు, ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏం చేశారని క్రెడిట్ ఇవ్వాలని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలోనే జగన్ క్రెడిట్, విద్యుత్తు రంగాన్ని సర్వనాశనం చేసినందుకు జగన్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ సెటైర్లు వేశారు.
News January 22, 2026
IITల్లో ఆగని ఆత్మహత్యలు.. మానసిక సమస్యలే కారణమా!

దేశవ్యాప్తంగా ఉన్న IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. IIT కాన్పూర్‌లో మంగళవారం మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల, భాషా వివక్ష, ఒంటరితనం, పోటీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో సూసైడ్ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ, కారణాలను తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.
News January 22, 2026
ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ‘నిఘా’ వైఫల్యం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత గాలిలో దీపమైంది. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మెడికల్ కౌన్సిల్ నిబంధనల కోసం పెట్టిన 12 మినహా, మిగిలినవన్నీ మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. నిర్వహణ లోపంతో కీలక నేరాలు జరిగినప్పుడు ఫుటేజీ లభించక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ కరువైందని రోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.


