News November 20, 2025

SRCL: ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి వీసీ

image

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. పంపిణీకి సంబంధించిన జిల్లా వివరాలను ఆమె సీఎంకు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Similar News

News January 13, 2026

670 సార్లు అప్లై చేసినా పట్టించుకోలేదు.. కట్ చేస్తే..

image

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కంటే తెలివితక్కువ పని ఇంకోటి లేదంటున్నారో టెకీ. ‘రిక్రూటర్లకు 670 అప్లికేషన్లు, 1000 మెసేజ్‌లు పంపినా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తులు ఆపేశా. వ్యక్తిగతంగా ప్రొడక్ట్ బిల్డింగ్, కంటెంట్ క్రియేషన్, నెట్‌వర్కింగ్‌పై ఫోకస్ చేశా. జనవరి-మే మధ్య 83మంది రిక్రూటర్లు సంప్రదించారు’ అని మర్మిక్ పటేల్ అనే వ్యక్తి తెలిపారు. మెటాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు.

News January 13, 2026

పెద్ద చింతరేవులలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

image

ధరూర్ మండలం పెద్దచింతరేవుల గ్రామంలో ఆంజనేయస్వామి జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే ఈ పోటీలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని నిర్వాహక కమిటీ సభ్యులు కోటిరెడ్డి, హనుమంతు, రాము, వీరేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కబడ్డీ జట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News January 13, 2026

నల్గొండ: ‘చిట్టిమల్లు’ రేపిన పల్నాటి యుద్ధం..!

image

పల్నాటి యుద్ధం.. తెలుగు వాళ్లకు పేరిన్నిక గల యుద్ధం. ఈయుద్ధానికి కారణం ఓ కోడి పుంజు అని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పుంజే చిట్టిమల్లు. ఒకప్పుడు పల్నాడులో రాజ్యాల మధ్య ఆధిపత్య, ఆక్రమణల కుట్రలు సాగాయి. నాయకురాలు నాగమ్మ కోడిపై గెలవడం కోసం బ్రహ్మనాయుడు మహిమ గల కోడి కోసం ఆరా తీస్తాడు. ఆనాడు శక్తిమంతమైన చిట్టిమల్లుగా పిలిచే పుంజును కుందూరు చోడుల రాజధానిగా ఉన్న మన NLG పానగల్లు నుంచే తీసుకెళ్లారు.