News November 19, 2025
SRCL: ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.
Similar News
News January 22, 2026
ఖమ్మం: ఆ ఇంట్లో అల్లుడే దొంగ..!

అత్తవారి ఇల్లు అల్లుడికి అడ్డా అనుకున్నాడో ఏమో గానీ, ఏకంగా నగలే ఊడ్చేశాడు. కారేపల్లి మండలానికి చెందిన రాంబాబు మద్యానికి బానిసై, డబ్బుల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తన అత్త కలమ్మ ఇంట్లోనే ఒకటిన్నర తులాల బంగారు నెక్లెస్ దొంగిలించాడు. దాన్ని అమ్మేందుకు వెళ్తుండగా KMM సత్యనారాయణపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిక్కాడు. అల్లుడే దొంగ అని తేలడంతో బాధితురాలు విస్మయం వ్యక్తం చేసింది.
News January 22, 2026
భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 48 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో NZ తడబడింది. ఫిలిప్స్(78), చాప్‌మన్(39) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. IND బౌలర్లలో చక్రవర్తి, దూబె చెరో 2, అక్షర్, అర్ష్‌దీప్, హార్దిక్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్(84), రింకూ సింగ్(44), సూర్యకుమార్(32) రాణించారు.
News January 22, 2026
చికిత్సకు డబ్బులు లేవని.. హృదయ విదారక ఘటన

TG: HYD కూకట్‌పల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. దివ్యాంగురాలైన కూతురు శ్రీజావలి(18) ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేవని తల్లిదండ్రులే గొంతునులిమి చంపేశారు. తర్వాత 2రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇవాళ కొడుకు నితిల్‌తో కలిసి భార్యభర్తలు సతీశ్, ఆమని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అది పనిచేయలేదని ముగ్గురూ చేతులు కోసుకున్నారు. బాధ భరించలేక నితిల్ తన ఫ్రెండ్‌కు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది.


