News December 1, 2025

SRCL: ‘నిబంధనలకనుగుణంగా విధులు నిర్వహించాలి’

image

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్‌ఓ)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఎన్నికల, ఓట్ల లెక్కింపు వివిధ అంశాలపై సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సాధారణ వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ తో కలిసి శిక్షణ ఇచ్చారు.

Similar News

News February 12, 2026

కమనీయం.. భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను గురువారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.

News February 12, 2026

ఖమ్మం: కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 అమలు

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5 మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. BNS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ర్యాలీలు, సభలు, ఐదుగురికిపైగా గుమికూడటం నిషేధమన్నారు. విజయోత్సవాలు, డీజేలు, టపాసులపై నిషేధం విధించారు. అదేరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నటరాజ’’

image

శివుడు సమస్త కళలకు, నాట్యానికి అధిపతి. ఆయన చేసే తాండవం సృష్టి గమనాన్ని సూచిస్తుంది. శివుడు ‘ఆనంద తాండవం’ చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణం జరుగుతుందని, ‘రుద్ర తాండవం’ చేసినప్పుడు దుష్టశిక్షణ జరుగుతుందని చెబుతారు. ప్రపంచంలోని అణువణువూ ఆయన చలనం (నాట్యం) వల్లే కదులుతోందని కొందరు శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. నాట్య కళ ద్వారా విశ్వ రహస్యాలను వెల్లడించే ఈ సార్వభౌముడిని ‘నటరాజు’గా మనం కొలుచుకుంటాం.