News September 12, 2025
SRCL: యూరియాకు ఈ పత్రాలు తప్పనిసరి: కలెక్టర్

యూరియా కోసం వచ్చే రైతులు తమ వెంట తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ తీసుకురావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, సుద్దాల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. మండలానికి మొత్తం ఎన్ని బస్తాల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్టల్ బేగంను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 8, 2025
చౌటుప్పల్: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో జరిగింది. సూర్కంటి కిరణ్ రెడ్డి (25) ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ మన్మథ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News December 8, 2025
SKLM: PG సెట్ లేకపోయినా.. సీట్ల కేటాయింపు

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSC మెడికల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై.పొలినాయుడు ఆదివారం తెలిపారు. PG సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులు ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 8, 2025
ప్రపంచాన్ని ఏకం చేసేలా HYDలో సమ్మిట్

HYD శివారు మీర్‌ఖాన్‌పేట్ గ్లోబల్ సమ్మిట్‌కు వేదికైంది. 44కిపైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు పాల్గొననున్న ఈ సమ్మిట్ మ.1:30కు ప్రారంభం కానుంది. నోబెల్ గ్రహీతలు అభిజిత్, కైలాష్ సత్యర్థి ప్రధాన వక్తలు. వీరిలో 46 మంది అమెరికా ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, అమెజాన్, ఐకియా తదితర ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, ఇతర దేశాల రాయబారులు రానున్నారు.


