News November 1, 2025
SRCL: ‘తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి’

తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇటీవల మొంథా తుఫాన్‌తో జిల్లాలో జరిగిన నష్టం అంచనాలు రూపొందించడంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా పాక్షికంగా, పూర్తిగా నష్టపోయిన ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు, పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 2, 2025
వేములవాడలో విద్యుత్ స్తంభాల తరలింపు

వేములవాడ పట్టణంలోని మెయిన్ రోడ్డులో విద్యుత్ స్తంభాల తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన రోడ్డు వెడల్పుతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం విస్తరణ పనుల నేపథ్యంలో ఇంతకుముందు ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి అమరుస్తున్నారు. ఆలయం దక్షిణం వైపు పాత ఆంధ్రబ్యాంకు వద్ద ఆదివారం నాడు సెస్ సిబ్బంది స్తంభాలు తరలించే క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను మల్లించారు.
News November 2, 2025
భీమన్న చెంతకు.. వేములవాడ రాజన్న కోడెలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడెలు శ్రీ భీమేశ్వరాలయానికి తరలి వెళ్తున్న వైనం భక్తులను ఆకట్టుకుంటున్నది. వేములవాడ క్షేత్రంలో ప్రత్యేకమైన కోడెమొక్కు సాంప్రదాయం అనాదిగా కొనసాగుతూ వస్తోంది. వివాహం కోసం, సంతానం కోసం భక్తులు ఎంతో దూరం నుండి వచ్చి రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాల కారణంగా రాజన్న ఆలయంలో కోడెమొక్కులను నిలిపివేసి భీమేశ్వరాలయంలోకి మార్చారు.
News November 2, 2025
WWC ఫైనల్: వన్డేల్లో పైచేయి ఎవరిదంటే..

ఇండియా, సౌతాఫ్రికా మధ్య మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో మొదలుకానుంది. వన్డేల్లో ఇప్పటిదాకా 34 మ్యాచుల్లో 2 టీమ్స్ తలపడ్డాయి. ఇందులో 20-13 లీడ్‌తో ఇండియాదే పైచేయి కావడం గమనార్హం. ఓ మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇక WCలో 6 మ్యాచ్‌లు ఆడగా తలో 3 గెలిచాయి. చివరగా WWCలోనే విశాఖలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది. మరోవైపు ఇవాళ్టి మ్యాచ్‌కు కాస్త వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది.


