News November 6, 2025
SRD: జాతీయ సాహస శిబిరానికి ‘తార’ విద్యార్థిని

కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు కొండల ప్రాంతంలో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీవిద్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ గురువారం తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా, శ్రీవిద్య అందులో ఒకరు. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు మనాలిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.
Similar News
News January 13, 2026
జనగామ జిల్లా సర్పంచ్‌లకు శిక్షణ శిబిరాలు!

జనగామ జిల్లాలో కొత్తగా ఎన్నికైన 280 మంది సర్పంచ్‌లకు ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 20 వరకు దశల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. తొలి విడతలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్లలోని 91 మందికి, రెండో విడతలో జనగామ, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పులలోని 79 మందికి, 3వ విడతలో స్టే.ఘ, చిల్పూర్, రఘునాథపల్లి, జఫర్ గఢ్, లింగాల ఘనపూర్లోని 110 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
News January 13, 2026
సంక్రాంతి విషెస్ చెప్పిన సీఎం రేవంత్

TG: తెలుగు ప్రజలకు CM రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అంతా ఆనందంగా జరుపుకోవాలి. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రతి కుటుంబానికి చేరాలనేది మా సంకల్పం. తెలంగాణ రైజింగ్-2047 విజన్ సాకారం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు.
News January 13, 2026
రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.


