News March 13, 2025
SRD: బ్యాంకింగ్‌లో ఉచిత శిక్షణ

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు బ్యాంకింగ్ కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి.ప్రవీణ్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగి 26 ఏళ్ల లోపు గల బీసీ అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8 వరకు www.tgbcstudycircle.cgg.gov.inలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 11, 2026
వనపర్తి జిల్లాలో 11 AMకు శాతం ఎంతంటే..!

వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలలో ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 32.05% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
అమరచింత- 36.45%,
ఆత్మకూర్- 32.65%,
కొత్తకోట- 32.10%,
పెబ్బేరు- 39.68%,
వనపర్తి 29.59% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. వనపర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డిలు సందర్శించి పరిశీలించారు.
News February 11, 2026
ADB: అడవిని తలపించిన మోడల్ పోలింగ్ కేంద్రం

మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ పట్టణంలోని 47వ వార్డు సైన్స్ డిగ్రీ కళాశాలలో అడవిని తలపించేలా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. వన్యప్రాణుల సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, నోడల్ అధికారి స్మిల్కాతో కలిసి పరిశీలించారు. వినూత్నంగా రూపొందించిన ఈ కేంద్రం ఓటర్లలో ఆసక్తిని రేకెత్తించింది.
News February 11, 2026
వికారాబాద్: తొలిసారి ఓటేసిన విద్యార్థిని

వికారాబాద్ జిల్లా ఆలంపల్లి గ్రామంలో ఓ విద్యార్థిని తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా ఆ బాలిక మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమవ్వడం గర్వంగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.


