News April 12, 2025

SRD: రాజీవ్‌ యువ వికాసం.. ఈనెల 14 వరకు అవకాశం

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు సంగారెడ్డి జిల్లాలో 22వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.

Similar News

News January 16, 2026

కౌన్సిలింగ్ కోసం AP RCET అభ్యర్థుల ఎదురుచూపులు

image

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో PhD ప్రవేశాల కోసం గత ఏడాది నవంబర్‌లో తిరుపతి SPWU ఆధ్వర్యంలో AP RCET పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 15న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కౌన్సిలింగ్ తేదీలు ఎప్పుడు వస్తాయేమో అని అర్హత సాధించిన అభ్యర్థులకు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి AP RCET కౌన్సిలింగ్, అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు.

News January 16, 2026

జగిత్యాల: కులాంతర వివాహ జంటలకు రూ.37.50 లక్షల బాండ్ల పంపిణీ

image

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు పంపిణీ చేశారు. మొత్తం రూ.37.50 లక్షల విలువైన బాండ్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు.

News January 16, 2026

జగిత్యాల: ‘దివ్యాంగులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తా’

image

దివ్యాంగులకు అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వపరంగా కల్పిస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్ద మొత్తంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలోనే మొదట ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు.