News October 8, 2025

SRD: రేటింగ్‌ పేరుతో కొత్త తరహా మోసం.!

image

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమీషన్ ఇస్తామని గతనెల 15న ఐటీ ఉద్యోగికి టెలిగ్రామ్‌తో ఎర వేశారు. టెలిగ్రామ్‌లో మెసేజ్ పంపిన నేరగాళ్లు రూ.5 వేలు పెట్టుబడి పెడితే రూ.12 వేలు పంపి కొద్ది మొత్తంలో లాభం చూపించారు. నమ్మకం పెంచి విడతలవారీగా ₹54 లక్షలు కాజేశారు. మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News January 23, 2026

ఒక్కరోజులో 5.38 లక్షల మంది విమానయానం

image

దేశీయ విమానయానంలో 2025 NOV 23వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ ఒక్కరోజే 5,38,249 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. 3,356 విమానాలు దేశంలో రాకపోకలు సాగించాయి. గత 3 ఏళ్లలో రోజువారీ 5 లక్షల మందికి పైగా ప్రయాణించిన సందర్భాలున్నాయని విమానయాన శాఖ పేర్కొంది. కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి చోట్ల రీజనల్ కనెక్టివిటీ పెరగడం దీనికి కారణంగా వివరించింది.

News January 23, 2026

పాలమూరు: భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య.!

image

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో అనుమానం ప్రాణం తీసింది. భార్య లలితకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో శివకుమార్ (35) మనస్తాపానికి గురై శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య తరచూ జరుగుతున్న గొడవలపై గతంలో పంచాయితీలు జరిగినా ఫలితం లేకపోయింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విక్రమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News January 23, 2026

అనంతపురం ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం అరెస్ట్?

image

అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాంను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి, నంబూరి వైన్స్‌కు నిప్పు పెట్టిన ఘటనల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కొన్నిరోజులు పరారీలో ఉన్న ఆయనను అనంతపురం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.