News February 10, 2025
SRD: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. SRD జిల్లాలో 27 ZPTCలు, 276 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీంగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.
Similar News
News February 16, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
News February 16, 2026
అన్నమయ్య: ఉత్కంఠ.. కోర్టుకు మాజీ మంత్రి

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందుతుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరులు సోమవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరు కానున్నారు. వారితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరి కొంతమంది కూడా కోర్టుకు రానున్నారు. పలు కారణాల రీత్యా ఈనెల 2న మాజీ మంత్రి సోదరులు తంబళ్లపల్లె కోర్టులో వాయిదాకు గైర్హాజరవడంతో వారి తరఫు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ సమర్పించిన విషయం తెలిసిందే.
News February 16, 2026
విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.


