News May 7, 2025

చెపాక్‌లో చెన్నైకి చెక్ పెట్టిన SRH

image

చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి SRH అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో CSKపై తొలిసారి గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 0, హెడ్ 19, ఇషాన్ 44, క్లాసెన్ 7, అనికేత్ 19, కమిందు 32*, నితీశ్ 19* రన్స్ చేశారు. నూర్ అహ్మద్ 2, ఖలీల్, కాంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను ఆరెంజ్ ఆర్మీ సజీవంగా ఉంచుకోగా, చెన్నై దాదాపుగా ఔటైంది.

Similar News

News February 10, 2026

చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

image

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.

News February 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాసం.. మద్దతుకు టీఎంసీ నిరాకరణ?

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు 100 మందికి పైగా విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ఆ నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేయనున్నారు.

News February 10, 2026

‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్!

image

దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ వివాదంలో భాగంగా నిర్మాత వేసిన కేసు ఉపసంహరణకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది. దీంతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు చిత్రం వెళ్లనుంది. క్లియరెన్స్ లభిస్తే ఈ నెలలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ రాజకీయ ఎంట్రీకి ముందు వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.