News April 27, 2024

టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవీ

image

AP: తాడికొండ మాజీ MLA ఉండవల్లి శ్రీదేవిని TDP అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జరిగిన MLC ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈమె వార్తల్లో నిలిచారు. YCP ఈమెను సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత TDPలో చేరారు. బాపట్ల MP టికెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల TDPలో చేరిన చిలకలూరిపేట YCP నేత <<12839437>>రాజేశ్<<>>ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.

Similar News

News April 14, 2026

16 నుండి మండలస్థాయి సదస్సులు : ADB కలెక్టర్

image

జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నిన్నగూగుల్ మీట్ లో దిశానిర్దేశం చేశారు. సదస్సుల నిర్వహణలో భాగంగా పోషణ్ మాస్ స్టాల్స్‌తో పాటు గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహ రహిత పంచాయతీలుగా తీర్మానం చేసిన గ్రామాలకు గుర్తింపునివ్వాలన్నారు.

News April 14, 2026

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే?

image

గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘OG’ సినిమా పార్ట్-2 పనులు మొదలైనట్లు సమాచారం. ఇందులో పవర్ స్టార్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ మరో లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఓజస్ గంభీర-ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్. పవన్ డేట్స్‌ను బట్టి షూటింగ్ మొదలవుతుందట.

News April 14, 2026

సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్.. తెలుసుకోకుంటే డేంజరే!

image

ఇళ్లు, హోటళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ తేదీ దాటినవి వాడితే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. సిలిండర్ పైభాగంలోని నంబర్లను బట్టి వాటి కాలపరిమితిని తెలుసుకోవచ్చు. A-27, B-28, C-29, D-30 నంబర్లు ఉంటే అందులో A: జనవరి-మార్చి, B: ఏప్రిల్-జూన్, C: జులై-సెప్టెంబర్, D: అక్టోబర్- డిసెంబర్ అని అర్థం. నంబర్లు ఏడాదిని సూచిస్తాయి. A-27 అంటే 2027 మార్చి వరకు అది సేఫ్.
#ShareIt