News September 22, 2024

శ్రీవాణి లెక్కలు కూడా తేల్చాలి: పవన్ కళ్యాణ్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ <<14169086>>విచారణను<<>> డిప్యూటీ CM పవన్ స్వాగతించారు. ‘CM చంద్రబాబు నిర్ణయంతో తిరుమలలో ఎవరి వల్ల ఈ అపవిత్రత జరిగిందనే విషయం బయటకు వస్తుంది. ఇదే సమయంలో శ్రీవాణి టికెట్ల వ్యవహారంపైనా విచారించాలి. భగవంతుడికి చేసే సేవల విషయంలోనే కాదు. ఆర్థికపరమైన అంశాలలోనూ గత పాలకులు ఏ విధమైన పెడపోకడలు అవలంభించారో ప్రజలకు తెలియాల్సిన సమయం ఇది. ధర్మో రక్షతి రక్షిత:’ అని Xలో ట్వీట్ చేశారు.

Similar News

News October 13, 2024

అందుకే సినిమాలు తగ్గించాను: దుల్కర్ సల్మాన్

image

సినిమాలకు విరామం ఇవ్వడానికి గల కారణాన్ని హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గత రెండేళ్ల నుంచి సినిమాలు తగ్గించాను. గతేడాది ఒక్క సినిమానే చేశా. అది నా తప్పే. అంతకుముందు చెప్పుకోదగ్గ సినిమాలు నా నుంచి రాకవపోడమే ఇందుకు ఓ కారణం. నా ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. దీంతో కాస్త విరామం తీసుకున్నా’ అని వెల్లడించారు. కాగా ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.

News October 13, 2024

హెజ్బొల్లాతో ఘర్షణ.. 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి

image

లెబనాన్‌లోని హెజ్బొల్లాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. సౌత్ లెబనాన్‌లో హెజ్బొల్లాతో జరిగిన భీకర ఘర్షణల్లో 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్-లెబనాన్ బోర్డర్‌లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.

News October 13, 2024

ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్

image

AP: భరించలేని ఇసుక రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. పేరుకే ఉచితం కానీ వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా మీదుగా నడుస్తోంది. మేము టన్ను ఇసుక రూ.475కు సరఫరా చేశాం. ఇందులో నేరుగా రూ.375 ఖజానాకు వచ్చేవి. మా హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?’ అని జగన్ ట్వీట్ చేశారు.