News November 6, 2025
SRP: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు శిబిరాలు

సింగరేణిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నవంబర్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీరాంపూర్, 17, 18 తేదీల్లో మందమర్రి, 24, 25 తేదీల్లో బెల్లంపల్లి, గోలేటి ఏరియాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సీఎంపీఎస్, సీపీఆర్ఎంఎస్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Similar News
News January 23, 2026
ప్రతి ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి: విశాఖ కలెక్టర్

ఈనెల 4వ శనివారం (జనవరి 24) జిల్లావ్యాప్తంగా ‘జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర (SASA)లో భాగంగా ఉదయం 6 గంటల నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. 86 విభాగాలు సమన్వయంతో పాల్గొని వివరాలను సాసా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
News January 23, 2026
అక్రమ కేసులకు భయపడేది లేదు: జోగి రమేశ్

అక్రమ కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తనపై అక్రమ కేసు పెట్టిందన్నారు. తాను నేరం చేయలేదని రుజువు చేయడానికి సిద్ధమన్నారు. దీనికి కూటమి ప్రభుత్వం సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. జైల్లో పెట్టి తనకు ఇంకా బలం చేకూర్చారని అన్నారు.
News January 23, 2026
కాగజ్‌నగర్: ఆ విషయం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు: RSP

దేశ, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో చెప్పారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన గోప్య వ్యవహారాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిర్గతం చేస్తోందని విమర్శించారు. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతలకు సిట్ నోటీసులు ఇస్తున్నారని, సిట్ అధికారిగా సజ్జనార్‌కు నైతిక అర్హత లేదన్నారు.


