News August 9, 2024
SRPT: కుమారుడి అప్పులు.. తల్లి సూసైడ్

కుమారుడు చేసిన అప్పుల వల్ల తల్లి సూసైడ్ చేసుకుంది.. ఈ ఘటన సూర్యాపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కలమ్మ సూర్యాపేటలో నివసిస్తోంది. ఆమె కుమారుడు జల్సాలకు అలపాడుపడ్డాడు. ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు రోజూ ఇంటికి వచ్చి అడగడంతో ఆమె మనస్తాపానికి గురైంది. నల్ల చెరువు సమీపంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
Similar News
News December 5, 2025
NLG: సీఎం పర్యటన.. 1,500 మంది పోలీసులతో భద్రత

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. సీఎం భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకుని సుమారు 1,500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ వివరించారు.
News December 5, 2025
NLG: గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి

నల్గొండ జిల్లా తిప్పర్తి, జొన్నలగడ్డ గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల కోసం నిధులను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
News December 5, 2025
NLG: త్రివిధ దళాలకు సహకారం అవసరం: నల్గొండ కలెక్టర్

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈనెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


