News September 11, 2025

SRPT: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ గురువారం తెలిపారు. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చన్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశమన్నారు.

Similar News

News December 16, 2025

పోలీసులను బెదిరిస్తే ఊరుకోం: పవన్

image

AP: పోలీసు ఉన్నతాధికారులను మాజీ సీఎం బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులను బెదిరిస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై కేసులు వేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళగిరిలో కానిస్టేబుల్స్‌ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మంత్రి నారా లోకేశ్ లేని లోటు కనిపిస్తోందని చెప్పారు.

News December 16, 2025

మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం!

image

జిల్లాలో మూడో విడతలో మొత్తం 68 గ్రామ పంచాయతీలకు గాను 67 జీపీల్లో పోలింగ్ జరగనుంది. ఒక జీపీ ఏకగ్రీవమైంది. అలాగే, 634 వార్డులకు గాను 71 వార్డులు ఏకగ్రీవం కాగా, 563 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. సర్పంచ్ స్థానానికి 230 మంది, వార్డు సభ్యుల స్థానానికి 1,424 మంది బరిలో ఉన్నారు. సజావుగా ఎన్నికల నిర్వహణకు 666 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News December 16, 2025

ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.1,17 కోట్లు

image

కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాస రెడ్డి అధ్వరంలో ఈరోజు లెక్కించారు. 70 రోజుల హుండీ ఆదాయం రూ.1,17,44,339 వచ్చిందని అధికారులు తెలిపారు. యూఎస్ఏ డాలర్లు 24, కెనడా డాలర్స్ 10, శ్రీలంక రూపి 100, 23 గ్రాముల బంగారు, 723 గ్రాముల వెండి వచ్చింది. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా నరసింహరాజు పాల్గొన్నారు.