News August 21, 2025

SRPT: ముదస్తుగానే వైన్స్ టెండర్లు..!

image

కొత్త వైన్స్‌కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుఖానాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది NOV 30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 DEC 1 నుంచి 2027 NOV 30 వరకు కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం టెండర్ ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 99 వైన్స్‌లు ఉన్నాయి.

Similar News

News January 21, 2026

రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌లు

image

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.

News January 21, 2026

VJA: మహిళ వేషం ధరించి చోరీ.. నిందితుడి అరెస్ట్

image

మహిళ వేషం ధరించి బంగారం చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కండ్రికకు చెందిన ఓ వృద్ధురాలని అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి మహిళ వస్త్రాలు ధరించి బంగారం సోమవారం చోరీ చేశాడు. ఈ ఘటనపై సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేసినట్లు నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం లాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News January 21, 2026

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

image

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.