News August 13, 2025
SRSPకి 12,769 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

అల్పపీడన ద్రోణితో వర్షాలు కురుస్తున్నా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరగడం లేదు. బుధవారం మధ్యాహ్నం 12,769 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రాగా సాయంత్రం 6.30 గంటలకు కూడా అంతే మొత్తంలో నీరు ఎగువ నుంచి వస్తోంది. దిగువకు 4,163 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,080 అడుగులు(45.161TMC)లకు నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 6, 2026
శాసనమండలిలో వైయస్‌ఆర్‌సీపీ మరో వాయిదా తీర్మానం

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
News March 6, 2026
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 262 మంది డుమ్మా

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 10,447 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News March 6, 2026
HYDలో స్విమ్మింగ్ పూల్స్ ఇవే!

సమ్మర్ షురూ అవ్వగానే పిల్లల్లో ఈతపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో GHMC నగరవ్యాప్తంగా మొత్తం 14 స్విమ్మింగ్ పూల్స్‌ను సిద్ధం చేసింది. వనస్థలిపురం సచివాలయనగర్, ఫేజ్-4 కాలనీ, మొఘల్‌పురా, చందులాల్ బారాదరి, విజయ్‌నగర్ కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట్, అమీర్‌పేట, సనత్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, KPHB 6వ ఫేజ్ తదితర ప్రాంతాల్లో పూల్స్‌ను ఏర్పాటు చేశారు.
# SHARE IT


