News August 22, 2025

SRSP 16 వరద గేట్ల ఓపెన్

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 98% నిండటంతో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ 16 వరద గేట్లు ఓపెన్ చేశారు. వాటి ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 75,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో తాజాగా 1,090.8 అడుగుల (79.658TMC) నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వివరించారు.

Similar News

News January 20, 2026

ప.గో: తల్లి చేసిన తప్పు.. పిల్లాడి ప్రాణం తీసిన కూల్ డ్రింక్!

image

భీమవరంలో తల్లి చేసిన తప్పు ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. భర్తపై అలిగిన లక్ష్మి అనే మహిళ కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని కొంచెం తాగి నిద్రపోయింది. లక్ష్మి కుమారుడు మహా రుద్ర కాంత్ మిగిలిన కూల్ డ్రింక్‌ తాగేశాడు. అస్వస్థతకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 20, 2026

చిత్తూరు; స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం

image

చౌడేపల్లి (M) కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలకు ఉదయం ఆవరణంలోకి వచ్చి ముగ్గు వేసి, నిమ్మకాయలు కోసి, అక్షింతలు వేసి తాంత్రిక పూజలు చేసినట్లు సీసీ కెమెరాలులో నమోదయ్యాయి. ఈ ఘటన చూసిన ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News January 20, 2026

విజయవాడ: పది రోజుల్లో అదిరిపోయే ఆదాయం!

image

సంక్రాంతి సందర్భంగా విజయవాడ బస్టాండ్ నుంచి 547 అదనపు సర్వీసులతోపాటు, ఆర్టీసీ లోకల్ సర్వీసుల ఏర్పాటుతో గణనీయంగా ఆదాయం రాబట్టుకుంది. ఈ నెల 8 నుంచి 19 వరకు రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.70-80 లక్షలు రాగా.. ఈ ఏడాది పెరిగింది. మచిలీపట్నం కేంద్రం పరిధిలో మరో రూ. 30-50 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కలిపి రూ.1.50 కోట్లకు పైగా పది రోజుల్లోనే ఆదాయం రావడం విశేషం.