News August 13, 2025

SRSP UPDATE: 12,769 క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో

image

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరుగుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు 8,350 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా మధ్యాహ్నం 12,769 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోందని, దిగువకు 4,163 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు(80.5TMC) కాగా ప్రస్తుతం 1,080 అడుగులు(44.937TMC)కు చేరింది.

Similar News

News March 14, 2026

పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

జంగేడు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం తనిఖీ చేశారు. పరీక్షా నిర్వహణ తీరు, కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షా హాళ్లను సందర్శించి, విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News March 14, 2026

మొదటి రోజు 99.9 శాతం హాజరు: డీఈవో

image

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 99.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రంగయ్య వెల్లడించారు.

News March 14, 2026

గారలో బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన జపనీస్

image

గార మండలం సాలిహుండం బౌద్ధక్షేత్రాన్ని జపాన్ దేశానికి చెందిన బృందం నేడు సందర్శించారు. ప్రాచీన బౌద్ధ స్మారకాలు, స్థూపాల అవశేషాలను ఆసక్తిగా పరిశీలించి వాటి చారిత్రక ప్రాముఖ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్శనతో సాలిహుండం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులంటున్నారు. ప్రజలు, ప్రతినిధులను వీరిని ఆత్మీయంగా ఆహ్వానించారు.