News May 7, 2025

SSS: ‘తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి’

image

శ్రీ సత్య సాయి జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గాల అభివృద్ధి పై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. నియోజవర్గాలలో తాగునీటి సమస్య నివారణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 18, 2026

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు!

image

TG: 2025-2028కు సంబంధించి ప్రైవేటు ఇంజినీరింగ్ ఫీజులను రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ఖరారు చేసింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. 63 కళాశాలల్లో పెంచగా, 19 కాలేజీల్లో తగ్గించింది. ఓ సంస్థలో అత్యధికంగా ₹62 వేలు పెరిగింది. CBITలో అత్యధికంగా ₹1.83 లక్షల ఫీజు ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి ఈ మేరకు TAFRC నివేదిక పంపింది. త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది.

News February 18, 2026

మదనపల్లె: ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!

image

అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ఆదేశించారు. పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. 50 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 28,550 మంది హాజరవుతారని చెప్పారు. CC కెమెరాలు, వైద్య శిబిరాలు, పోలీస్ బందోబస్తు, తాగునీరు, మరుగుదొడ్లు, RTC బస్సులు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే 9866112750కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News February 18, 2026

EC.. తుగ్లక్ కమిషన్: మమతా బెనర్జీ

image

ఎన్నికల సంఘం ఓ తుగ్లక్ కమిషన్ అని బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. ‘BJP ఐటీ సెల్ కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లను AI ద్వారా తొలగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా EC ధిక్కరిస్తోంది’ అని విమర్శించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని, వారిని టెర్రరిస్టుల్లా చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.