News May 7, 2025
SSS: ‘మలేరియా నిర్మూలనకు సహకరించాలి’

మలేరియా నిర్మూలనకు అందరూ సహకరించాలని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రోజా బేగం పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పుట్టపర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య శాఖ అధికారి మాట్లాడుతూ.. పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు.
Similar News
News February 12, 2026
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: అనకాపల్లి ఎస్పీ

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. బుధవారం రాత్రి అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
News February 12, 2026
NLR: దొంగతనం నింద వేశారని విద్యార్థి సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. టీపీగూడూరు(M) మండలం పేడూరు గమ్మళ్లపాలేనికి చెందిన యువకుడు(16) ఓ ప్రైవేట్ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉరేసుకున్నాడు. అతను చదివే స్కూల్లో నగదు దొంగతనం జరిగిందని.. విద్యార్థే చోరీ చేశాడని టీచర్లు నిలదీశారంట. నింద భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.
News February 12, 2026
కంది ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ పలు ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ అసోసియేట్, అటెండెంట్ విభాగాల్లో మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 13వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


