News February 7, 2025
ఈ నెల 14న రాష్ట్ర బంద్: మాల మహానాడు

TG: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి. మాలలను అణచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MRPS నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డాయి.
Similar News
News February 17, 2026
మగువల ఆరోగ్యానికి మెంతిఆకు

మెంతి కూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలకు ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియా రాకుండా ఉంటుంది. అలాగే క్యాలరీలు కూడా తక్కువ కాబట్టి వెయిట్‌లాస్‌కు దోహదపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాలింతలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెనోపాజ్, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి, ఎ లతోపాటు బీటా కెరొటిన్ సమృద్ధిగా ఉంటుంది.
News February 17, 2026
IOCL 121పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 17, 2026
జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్‌ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్‌ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.


