News March 28, 2024

స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు జోరు కనబరుస్తున్నాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 830 పాయింట్లు తాకి 73,826కు చేరింది. మరోవైపు నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 22,370కు చేరింది. రియల్టీ మినహా ఇతర ప్రధాన రంగాలన్నీ 0.5-1శాతం లాభాలతో ట్రేడవడం మార్కెట్‌కు కలిసొచ్చింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, హీరోమోటోకార్ప్, JSWస్టీల్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

Similar News

News February 19, 2026

608 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (<>HPCL<<>>)608 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్)అర్హత గలవారు MARCH 2 వరకు NATS 2.0 పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.25,000 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.hindustanpetroleum.com

News February 19, 2026

సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News February 19, 2026

ప్రతి జిల్లా కాంప్లెక్స్‌లో తెలంగాణ తల్లి విగ్రహం

image

TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 33 జిల్లా కేంద్ర కార్యాలయ భవనాల కాంప్లెక్సుల్లో వీటి ఏర్పాటుకు రూ.5.80 కోట్ల విడుదలకు పాలనా అనుమతి జారీచేసింది.