News December 3, 2024
Stock Market: వరుసగా మూడోరోజు లాభాలు
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో పయనించాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, IT షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతు బెంచ్ మార్క్ సూచీల గెయిన్స్‌కు దన్నుగా నిలిచాయి. Sensex 597 పాయింట్ల లాభంతో 80,845 వద్ద, Nifty 181 పాయింట్ల లాభంతో 24,457 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు Sensexలో 80,900 వద్ద, నిఫ్టీలో 24,480 పరిధిలో ఉన్న కీలక Resistance సూచీలను తదుపరి ముందుకు కదలనివ్వలేదు.
Similar News
News January 23, 2025
‘గాంధీ తాత చెట్టు’ మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణి నటించిన ‘గాంధీ తాత చెట్టు’పై సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మీతో పాటు ఉండిపోతుందని చెప్పారు. అహింస గురించి పదునైన కథను దర్శకురాలు పద్మ మల్లాది అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. చిన్నారి నేస్తం సుకృతి శక్తిమంతమైన ప్రదర్శనతో తనను గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ఈ కళాఖండాన్ని చూసి తీరాలని Xలో రాసుకొచ్చారు.
News January 23, 2025
బీసీ రిజర్వేషన్లు పెంచాలని సీఎంకు కవిత లేఖ
TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు రిజర్వేషన్లు 42% పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని MLC కవిత విమర్శించారు. కులగణన వివరాలను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కుంటి సాకులతో తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను సహించబోదని హెచ్చరించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు.
News January 23, 2025
అటవీశాఖలో మార్పులపై పవన్ ఫోకస్
AP: అటవీశాఖలో సమూల మార్పులపై Dy.CM పవన్ దృష్టి సారించారు. అటవీ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు యాక్షన్ ప్లాన్, అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.