News March 6, 2025

నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిన స్టాక్‌మార్కెట్లు

image

ఆరంభంలో నష్టపోయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు మధ్యాహ్నం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,440 (+111), సెన్సెక్స్ 73,991 (+280) వద్ద చలిస్తున్నాయి. ఉదయం ఈ సూచీలు అరశాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్, కమోడిటీస్, ఎనర్జీ, ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా షేర్లు దుమ్మురేపుతున్నాయి. NSEలో 2818 షేర్లు ట్రేడవ్వగా ఏకంగా 2255 పెరిగాయి.

Similar News

News December 12, 2025

INDvsSA.. 5 పరుగులు, 5 వికెట్లు

image

SAతో రెండో టీ20లో IND 162 పరుగులకు ఆలౌటై 51 రన్స్ తేడాతో <<18539012>>ఓడింది<<>>. చివరి 5 వికెట్లను 5 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 8 బంతుల్లో 5 వికెట్లు పడ్డాయి. 157 రన్స్ వద్ద 6, 158 వద్ద 7, 162 వద్ద 8, 9, పదో వికెట్ పడింది. అభిషేక్(17), గిల్(0), SKY(5), తొలి టీ20లో అదరగొట్టిన హార్దిక్ (23 బంతుల్లో 20) స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడం, స్పిన్నర్లను బాగా ఆడే దూబేను 8వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం INDను దెబ్బతీసింది.

News December 12, 2025

ప్రెగ్నెన్సీకి ముందు ఏ టెస్టులు చేయించుకోవాలంటే..

image

ప్రతి మహిళ ప్రెగ్నెంట్ అయ్యే ముందు కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు. వాటిల్లో ముఖ్యమైనవి రూబెల్లా, చికెన్ పాక్స్, HIV, హెర్సస్, హెపటైటిస్ B, థైరాయిడ్, జన్యు పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. వీటితో పాటు గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా టీకాలు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మెంటల్ హెల్త్ చెకప్ కచ్చితంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News December 12, 2025

బల్మెర్ లారీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>బల్మెర్ లారీ<<>> 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech, డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com