News March 5, 2025
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి వణికిస్తే.. మధ్యాహ్నం మాత్రం వేసవి వచ్చిందన్న విషయం గుర్తొచ్చేలా వేడిమి అల్లాడిస్తోంది. అక్కడక్కడా తప్పితే రెండు రాష్ట్రాలవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. వేసవిలో రాత్రుళ్లు చల్లగా ఉండటం బాగానే ఉన్నా దాని వల్ల పగటి వేడిమి తాకిడి మరింత ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News December 15, 2025
ధనుర్మాసంలో ఆచరించాల్సిన పూజలు, వ్రతాలు

ధనుర్మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. అనేక రకాల వ్రతాలను ఆచరిస్తారు. అందులో గోదాదేవి కాత్యాయనీ వ్రతం ప్రధానమైనది. ఇందులో శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథులను పూజిస్తారు. అలాగే చాంద్రమానం ప్రకారం వచ్చే మార్గశీర్ష వ్రతం మనలో సత్వగుణాన్ని పెంచుతుంది. వీటితో పాటు శ్రీవ్రతం, సిరినోములను ఆచరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఇంట్లో సిరిసంపదలు, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం.
News December 15, 2025
నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్

H1B, H4(డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది. ఈ ప్రక్రియను ‘వెట్టింగ్’గా పిలుస్తున్నారు. దరఖాస్తుదారులంతా SM సెట్టింగులను ప్రైవేటు నుంచి పబ్లిక్ మార్చుకోవాలని US విదేశాంగ శాఖ సూచించింది. ‘ప్రతి వీసా నిర్ణయం నేషనల్ సెక్యూరిటీ కోణంలోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్లు దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించరని మేం నమ్మాలి’ అని పేర్కొంది.
News December 15, 2025
రబీ సాగు నిరాశాజనకం

APలో రబీ సాగు ఆశించినస్థాయిలో సాగడం లేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా ఖరీఫ్ పంటల కోతలు ఆలస్యమవడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ కింద వరి సాగుకు నీటి గ్యారంటీ లేకపోవడమూ మరో కారణమని పేర్కొంటున్నారు.


