News February 10, 2025

విచ్చలవిడిగా బూతులు.. మీకామెంట్!

image

న్యూ జనరేషన్.. ఏదైనా ఓపెన్‌గా అనేస్తాం. వావీ వరసా లేదు.. నోటికొచ్చిన పచ్చి బూతులు మాట్లాడేస్తాం. తల్లిదండ్రులన్న ఇంగితం లేదు.. వాళ్ల శృంగారంపై జోకులేసేస్తాం. ఇదీ ప్రస్తుతం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల తీరు. మొన్నటి వరకు స్టాండప్ కామెడీలో ఇదే వరస. తాజాగా YTలో బీర్‌బైసిప్స్ ఛానల్ ఓనర్ రణ్‌వీర్ అలహాబాదియా మాటలతో మరోసారి దేశం అవాక్కయింది. పిల్లలపై ప్రభావం చూపించే ఈ విచ్చలవిడితనంపై మీ కామెంట్.

Similar News

News February 16, 2026

పత్తిలో కలుపు సమస్య- నివారణకు సూచనలు

image

☛ పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి. ☛ వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.

News February 16, 2026

జేఈఈ మెయిన్ ఫైనల్ కీ రిలీజ్

image

జేఈఈ మెయిన్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో NTA ఫైనల్ కీ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఫలితాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఇవాళ వెల్లడిస్తామని 4రోజుల కిందట అప్డేట్ ఇచ్చింది. తాజాగా కీ విడుదల కాగా ఏ క్షణంలోనైనా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సుంది.

News February 16, 2026

అభిషేక్ ఫ్లాప్ షో.. 6 మ్యాచుల్లో 4 డకౌట్స్

image

T20Iల్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్లాప్ షో నడుస్తోంది. T20WCలో ఆడిన 2 మ్యాచుల్లోనూ సున్నాకే వెనుదిరిగారు. అటు చివరి 6 మ్యాచుల్లో 4 సార్లు డకౌట్(0, 68*, 0, 30, 0, 0,) అయ్యారు. అభిషేక్ టాలెంట్‌పై సందేహం లేకపోయినా T20WCలాంటి పెద్ద వేదికల్లో ఇలా నిలకడ చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం. అటు ఈ ఫార్మాట్లో భారత ఓపెనర్లలో అత్యధికంగా రోహిత్ 10సార్లు, ఆ తర్వాత అభిషేక్&రాహుల్ 5సార్లు డకౌట్ అయ్యారు.