News May 13, 2024

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ

image

TG: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు చెప్పారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ చివరి మూడు గంటలు అలర్ట్‌గా ఉంటామని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

image

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.

News December 5, 2025

కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.

News December 5, 2025

FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

image

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.