News August 20, 2025
ప్రభుత్వ ఆలోచనకు సమ్మె అడ్డంకిగా మారింది: సీఎం రేవంత్

TG: సినీ కార్మికులు సమ్మె విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సమ్మె ప్రభావం సినిమా పాలసీపై పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు సమ్మె అడ్డంకిగా మారిందని సీఎం తెలిపారు. వేతనాలు పెంచాలని 17 రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 23, 2026
బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.
News January 23, 2026
బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.
News January 23, 2026
జనవరి 23: చరిత్రలో ఈరోజు

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం (ఫొటోలో)


