News February 7, 2025
ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ వీసాలు రద్దు.. ఎందుకంటే?

అమెరికాకు వెళ్లిన స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ పరిమితికి మించి పార్ట్ టైమ్ జాబ్స్ చేసి ఇబ్బందులపాలవుతున్నారు. ఇలా చేయడంతో విద్యార్థుల వీసాలు రద్దవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటీసులను Xలో షేర్ చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ 15 రోజుల్లో 48గంటల కంటే తక్కువ సేపు మాత్రమే పనిచేయాలి.
Similar News
News February 16, 2026
నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్!

TG: నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా రూ.1,698 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గ్రాంట్లు పెరగగా ఏడాదిలోనే రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చాయి.
News February 16, 2026
పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రుళ్లే ఎందుకు?

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రి వేళ లేదా తెల్లవారుజామునే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం అరుంధతీ నక్షత్ర దర్శనం. ఆకాశంలో దర్శనమిచ్చే అరుంధతి, వశిష్ఠుల జంట అన్యోన్యత, పాతివ్రత్యానికి ప్రతీక. వారిలా వధూవరులు నూరేళ్లు వర్ధిల్లాలని పురోహితులు ఈ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రం అర్థరాత్రి/తెల్లవారుజామునే కనిపిస్తుంది. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు.
News February 16, 2026
సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


