News December 1, 2025
SUలో అవినీతి.. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఎక్కడ..?

SUలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ రిపోర్ట్ ఏంటన్నది పజిల్‌గా మారింది. నెలలు గడుస్తున్నా విచారణ పూర్తికాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ లేకుండా నియామకాలు, పరిపాలనా విభాగం 1st ఫ్లోర్‌కు రూ.7కోట్ల నుంచి రూ.9కోట్లకు అంచనాలు పెంచారన్న ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశించింది.అయితే విచారణ జరుగుతున్నా ఇప్పటికీ PHD లేనివారిని ప్రొఫెసర్స్‌గా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
Similar News
News February 17, 2026
కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న మొదటి పేపర్, 27న రెండో పేపర్, మార్చి 2, 5, 7, 9 తేదీల్లో మిగిలిన పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొన్నారు.
News February 17, 2026
కాంగ్రెస్‌కు సత్తా లేదు.. బీజేపీతో కుమ్మక్కు: హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా BRSను ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కు అయిందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఈరోజు మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైందని ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీలు ఒకటై బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయని, ఆ పార్టీల చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
News February 17, 2026
సిద్దిపేట: మహిళలకే అందలం.. కొత్త ఛైర్‌పర్సన్‌లు వీరే

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాల్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వు అయ్యాయి. దీంతో కీలకమైన ఆ పదవిలో నలుగురు మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ముస్త్యాల అరుణ, దుబ్బాక- శ్రీరామ్ సంగీత, గజ్వేల్-గంగిశెట్టి చందన, హుస్నాబాద్- దండి లక్ష్మిలు పదవి చేపట్టారు.


