News November 7, 2025

SU స్నాతకోత్సవంలో గణేష్‌కు 2 బంగారు పతకాలు

image

శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన రెండో స్నాతకోత్సవంలో 2016-2018 సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పేరగాని గణేష్ రెండు బంగారు పతకాలు సాధించాడు. సోషియాలజీ డిపార్ట్‌మెంట్ టాపర్‌గా, గ్రామీణ సమాజ శాస్త్రంలో అత్యధిక స్కోర్ సాధించినందుకు గానూ, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా పతకాలను తీసుకోవడం ఆనందంగా ఉందని గణేష్ తెలిపాడు.

Similar News

News January 18, 2026

రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారింది: మాజీ మంత్రి

image

AP: గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవా వెళ్లేవారని.. ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. MLAలంతా సంపాదనపై పడ్డారని ఆరోపించారు. పేకాట, కోడి పందేలా పేరిట దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా తయారయ్యారని మండిపడ్డారు.

News January 18, 2026

అన్నప్రసాదంపై దుష్ప్రచారం వద్దు: భద్రాద్రి ఈఓ

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి అన్నప్రసాద వితరణపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆలయ ఈఓ దామోదర్ రావు కోరారు. ఆదివారం అన్నదాన సత్రాన్ని తనిఖీ చేసి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులందరికీ అన్నప్రసాదం అందుతోందని, ఆలయ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు పెట్టడం సరికాదని హితవు పలికారు. నిరాధారమైన ఆరోపణలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 18, 2026

చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

image

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.