News May 1, 2024

ఏపీలో గంజాయికే మద్దతు ధర: పవన్

image

AP: రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర ఉండదని.. గంజాయికి మాత్రమే ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘సీఎం జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలి. రాష్ట్రంలోని రైతులు అప్పులపాలయ్యారు. కానీ గంజాయి పండించేవారు మాత్రం లాభాల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు.

Similar News

News December 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

ప్రసార భారతి, న్యూఢిల్లీలో 16 కాస్ట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. CMA ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాస్ట్ ట్రైనీలకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి సంవత్సరం రూ.15,000, రెండో సంవత్సరం రూ.18,000, మూడో సంవత్సరం రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

News December 16, 2025

సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

image

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.

News December 16, 2025

25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

image

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.