News April 13, 2024
కేజ్రీవాల్ పిటిషన్‌పై 15న సుప్రీం విచారణ

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును CM కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈనెల 15న విచారించనుంది. తన అరెస్టు అక్రమమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించి, ఆ తర్వాత మరో 4 రోజులు పొడిగించింది. అది ముగిశాక ఈనెల 15 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది.
Similar News
News December 16, 2025
NZB: బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్‌లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News December 16, 2025
మాజీ ఎంపీ రామ్ విలాస్ కన్నుమూత

రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67) కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రేవా(మధ్యప్రదేశ్)లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో నిన్న చనిపోయారు. వేదాంతి అంత్యక్రియలు ఇవాళ అయోధ్యలో జరగనున్నాయి. ఆయన తన జీవితాన్ని అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2సార్లు MPగా గెలిచారు.
News December 16, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ZSI)లో 9 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జువాలజీ/వైల్డ్ లైఫ్ సైన్స్/ఎకాలజీ/లైఫ్ సైన్సెస్/ఆంథ్రోపాలజీ), పీహెచ్‌డీ, ఎంఏ(ఆంథ్రోపాలజీ/సోషల్ సైన్సెస్/హిస్టరీ/ఎకనామిక్స్/ఫిలాసఫీ) ఉత్తీర్ణులు అర్హులు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.57వేలు+HRA, ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.35వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://zsi.gov.in


