News June 17, 2024

బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా సురేశ్‌రెడ్డి

image

TG: బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. కె.కేశవరావు స్థానంలో సురేశ్‌కు అవకాశం ఇచ్చినట్లు రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ దక్కలేదు.

Similar News

News January 15, 2026

ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

image

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్‌ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.

News January 15, 2026

మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

image

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.

News January 15, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

హైదరాబాద్‌లోని <>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ &డెవలప్‌మెంట్ లాబోరేటరీ(DRDL) అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ అర్హతగల వారు నేటి నుంచి JAN 29 వరకు www.apprenticeshipindia.gov.inలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు, డాక్యుమెంంట్స్‌ను కంచన్‌బాగ్‌లోని DRDLకు పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in