News September 12, 2025

నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల

image

నేపాల్ తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆమె నేపాల్ తొలి మహిళా PMగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీల పేరును Gen-z యువత ప్రతిపాదించగా ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఆమోదించారు. నిన్నటి నుంచి ఆర్మీ సమక్షంలో నిరసనకారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం పార్లమెంట్‌‌ను రద్దు చేశారు. కాగా సుశీలకు భారత్‌‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె మన దేశంలో విద్యనభ్యసించారు.

Similar News

News December 16, 2025

చియా ఫేస్‌ప్యాక్‌తో ముఖానికి మెరుపు

image

ముఖంపై ముడతలు తగ్గి, అందంగా కనిపించడానికి చియాసీడ్స్ ప్యాక్ ఉపయోగపడుతుంది. చియాసీడ్స్‌ను నీటిలో లేదా కలబందగుజ్జులో పావుగంట నానబెట్టాలి. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగెయ్యాలి. ఈ మాస్క్ ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, చర్మకణాల్లో కొలాజెన్‌‌ను పెంచుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, కొత్త కాంతి వస్తుంది.

News December 16, 2025

దేవాలయాలకు వీటిని తీసుకెళ్తున్నారా?

image

గుడిలోకి ప్రవేశించేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించడం, తీసుకువెళ్లడం శుభం కాదు. ఎందుకంటే తోలును చనిపోయిన జంతువుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి అవి అపవిత్రమైన పదార్థాల కోవకు చెందుతాయి. పాదరక్షలు, బెల్టులు, పర్సులు వంటి తోలు వస్తువులతో ఆలయంలోకి వెళ్లడం దేవతలను అగౌరవపరచడం అవుతుంది. ఆలయ పరిశుద్ధత కాపాడటానికి భక్తులు ఆలయానికి ఇవేం తీసుకురాకుండా పరిశుభ్రమైన మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.

News December 16, 2025

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాల్సిందే: NMC

image

డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ వాళ్లకు తప్ప ఎవరికీ అర్థం కాదనే మాటలు వింటుంటాం. దీనికి చెక్ పెట్టేలా నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌‌ను స్పష్టంగా, అర్థమయ్యేలా, క్యాపిటల్స్ లెటర్స్‌లో రాయాలని స్పష్టం చేసింది. ఇది కచ్చితంగా అమలయ్యేలా ప్రత్యేక కమిటీలు వేయాలని మెడికల్ కాలేజీలను ఆదేశించింది. ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.