News March 26, 2024

రఘురామ సీటుపై సస్పెన్స్

image

AP: నరసాపురం MP రఘురామ కృష్ణరాజు BJP నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా నరసాపురం టికెట్‌ను శ్రీనివాస వర్మకు BJP కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని TDP నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం MP సీటు ఆలోచించగా అక్కడి నాయకులు అంగీకరించలేదట. దీంతో ప.గో జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ సీట్లో ఎవరినైనా పోటీకి ఆపి రఘురామను బరిలో నిలిపే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 13, 2026

నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

image

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.

News February 13, 2026

ప్రెగ్నెన్సీకి సిద్ధంగా ఉన్నారా?

image

ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసినప్పటి నుంచే చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చడానికి ముందు మహిళలు తమ శరీరం అందుకు సహకరించేలా చూసుకోవాలి. ఎముకలు, కండరాల పటిష్టత, శరీరంలోని రక్తం పరిమాణం, శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వ్యాయామం, పోషకాహారం తప్పనిసరి. థైరాయిడ్‌, విటమిన్‌ D3, విటమిన్‌ B12, బ్లడ్‌ షుగర్‌ టెస్టులు కూడా చేయించుకోవాలి.

News February 13, 2026

10వేల కండోమ్స్ 3 రోజుల్లో ఖతం

image

శీతాకాల ఒలింపిక్స్-2026లో కండోమ్స్ కొరత ఏర్పడింది. 2900 మంది అథ్లెట్స్ కోసం 10వేల ప్యాకెట్లను సిద్ధం చేయగా 3 రోజుల్లోనే షెల్ఫులు ఖాళీ అయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో, విమర్శలు రాకుండా వెంటనే స్టాక్ తెప్పిస్తున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా ఒలింపిక్స్‌లో చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు. కరోనా సమయంలో మాత్రం వీటికి బ్రేక్ పడింది.